'యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

'యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'

NRML: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని రూరల్ సీఐ కృష్ణ, ఎస్సై లింబాద్రి అన్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు శుక్రవారం పట్టణంలోని వైయస్సార్ కాలనీలో గాంజా గస్తీ కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తు పదార్థాలు వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ కాలనీవాసులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.