నేడు మండల సర్వసభ్య సమావేశం
AKP: అనకాపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నేడు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో ఆశాజ్యోతి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు ఎంపీపీ గొర్లి సూరిబాబు అధ్యక్షతన స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో జరిగే సమావేశానికి ఎంపీటీసీలు సర్పంచులు హాజరుకావాలని కోరారు. అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి రావాలని సూచించారు.