నిజాయితీని చాటుకున్న పారిశుద్ధ్య కార్మికురాలు
ఓ పారిశుద్ధ్య కార్మికురాలు తన నిజాయితీని చాటుకున్నారు. తమిళనాడు శివగంగకు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు సెల్వీకి చెత్తలో రూ.18 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు దొరికాయి. వెంటనే ఆమె ఆ ఆభరణాలను పోలీసులకు అప్పగించింది. దీంతో అధికారులు విచారణ జరిపి బాధితులకు ఆ ఆభరణాలను అప్పగించారు. దీంతో సెల్వీ నిజాయితీని మెచ్చుకున్న బంగారు ఆభరణాల యజమాని ఆమెకు రూ.20 వేల బహుమతిని అందించారు.