భారీ వర్షాలకు కూలిన చెట్టు

భారీ వర్షాలకు కూలిన చెట్టు

PLD: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కారంపూడి పట్టణంలో గురువారం ఉదయం ఒక భారీ వృక్షం కూలిపోయింది. మాచర్ల రోడ్డుపై ఈ ఘటన జరగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న రెవెన్యూ సిబ్బంది, ట్రాఫిక్ పునరుద్ధరణ కోసం చెట్టును తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.