ఐదేళ్లకే దెబ్బతిన్న సీసీ రోడ్లు..!
GDWL: మానవపాడు మండలం పెద్దపోతులపాడులో సీసీ రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. రోడ్డు వేసి ఐదేళ్లు కూడా కాకముందే భారీగా పగుళ్లు రావడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని పనులు, అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే రోడ్లు త్వరగా పాడయ్యాయని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని, వెంటనే రోడ్లకు మరమ్మతులు చేయాలని కోరారు.