ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

ASF: అసిఫాబాద్ మండలం అడా గ్రామంలోని PHC ని జిల్లా కలెక్టర్ హరిత శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి రిజిస్టర్‌లు తనిఖీ చేశారు. ఆసుపత్రి వార్డులు, ఔషధ కేంద్రం, పరిసరాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సహాయం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలన్నారు.