ఐటీఐలో రిజిస్ట్రేషన్‌కు జూలై 15 ఆఖరి తేదీ
SKLM: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ITIల్లో రిజిస్ట్రేషన్‌కు జూలై 15 ఆఖరి తేదీ అని జిల్లా DLTC సహాయ సంచాలకులు ఎండ మోహనరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎలక్ట్రిషీయన్, ఫిట్టర్, మోటార్ మెకానిక్, డ్రాప్స్ మెన్ సివిల్(2 సం. కోర్సులు), కంప్యూటర్ ప్రోగ్రామింగ్, అసిస్టెంట్ టైలరింగ్(ఏడాది కోర్స్)లకు జూలై 15 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.