నల్లజెండాలతో ఎమ్మార్పీఎస్ నిరసన ర్యాలీ

HNK: హన్మకొండ అంబేడ్కర్ విగ్రహం నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS) ఆధ్వర్యంలో బుధవారం నల్ల జెండాలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. డిఎస్సీ ఫలితాలలో ఎస్సీ వర్గీకరణ అమలుచేయకుండా సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పి మాదిగలను మోసం చేసినందుకు నిరసనగా ర్యాలీ చేపట్టామని ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు.