రాష్ట్ర స్థాయిలో పైడిపెల్లి విద్యార్థినికి ఫస్ట్ ర్యాంక్
JGL: నిన్న విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ఫలితాల్లో వెల్గటూర్ మండలం పైడిపెల్లి గ్రామానికి చెందిన గాలి సౌమ్య రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటింది. కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చదువుతున్న సౌమ్య శ్రీ, ఎంపీసీ (MPC) విభాగంలో 470 మార్కులకు గాను 469 మార్కులు సాధించి ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.