విద్యార్థినిని వేధించిన అధ్యాపకుడు అరెస్ట్
ASR: ప్రేమ పేరుతో విద్యార్థినిని వేధించిన ఓ అతిథి అధ్యాపకుడిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. సీఐ గోవిందరావు వివరాల మేరకు.. అల్లూరి జిల్లాకు చెందిన విద్యార్థిని నర్సీపట్నంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతుంది. కోన నారాయణరావు ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని విద్యార్థిని వాంగ్మూలంతో కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. నిందితుడిని నర్సీపట్నం కోర్టులో హాజరుపరారు.