‘రైతుల అభివృద్ధికి కృషి చేయాలి’

KDP: సొసైటీలు రైతుల అభివృద్ధికి కృషి చేయాలని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి సూచించారు. మండల పరిధిలోని గడ్డం వారి పల్లె సొసైటీ ఛైర్మన్‌గా కొమ్మద్ది గ్రామానికి చెందిన రామిరెడ్డి సూర్యనారాయణ రెడ్డి సోమవారం సొసైటీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. రైతులకు విరివిగా పంట రుణాలు ఇవ్వాలని, వ్యవసాయరంగ అభివృద్ధికి ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు.