టీడీపీ నాయకుడికి బండారు శ్రావణి పరామర్శ

ATP: పుట్లూరు మండలం ఎస్.తిమ్మాపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు జయరాం రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను ఎమ్మెల్యే బండారు శ్రావణి పరామర్శించారు. ఆరోగ్యంపై ఆరా తీశారు. మెరుగైన చికిత్స తీసుకొని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు.