ఒకప్పుడు పోలీస్ అధికారి.. ఇప్పుడు ఆదర్శ రైతు

WGL: వర్ధన్నపేటకు చెందిన రిటైర్డ్ ఎస్సై బొల్లు యాదవ రెడ్డి వ్యవసాయంలో ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉద్యోగ విరమణ పొంది పదేళ్లు గడిచినా ఇప్పటివరకు తనకున్న పొలంతో పాటు మామిడి తోటను సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. చుట్టుపక్క రైతులకు సాగులో మెళకువలను చెబుతూ చేదోడుగా నిలుస్తున్నారు. ఆధునిక పద్ధతుల వ్యవసాయం ఎలా చేయాలో వివరిస్తున్నారు.