అమీర్‌పేట్‌లో పేలిన వాషింగ్ మెషీన్
HYD: అమీర్‌పేట్‌లో ఓ ఇంట్లో వాషింగ్ మెషీన్ పేలడం కలకలం రేపింది. భారీ శబ్దంతో వాషింగ్ మెషీన్ ముక్కలైంది. అదృష్టవశాత్తూ పేలుడు జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ఇంట్లోని కుటుంబ సభ్యులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వాషింగ్ మెషీన్ పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.