పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన ఏసీపీ
రంగారెడ్డి: చేవెళ్ల మండలం ముడిమ్యాల గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని ఏసీపీ కిషన్ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశామని, ప్రజలంతా ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు.