నెల్లూరు స్పెషల్.. ఉగాది వేళ తలపాగా సమర్పణ

నెల్లూరు స్పెషల్.. ఉగాది వేళ తలపాగా సమర్పణ

నెల్లూరు జిల్లాలో ఉగాది వేడుకలకు ప్రత్యేకత ఉంది. ఆ రోజున తలపాగాల వేడుకను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో ఈ రోజున స్వామివారికి నూతన వస్త్రాలతో పాటు తలపాగా కూడా సమర్పించడం ఆనవాయితీ. జరీతో తయారు చేసిన తలపాగాను స్వామివారికి అలంకరించడం వల్ల ఏడాది అంతా శుభం కలుగుతుందని ప్రజల నమ్మకం.