పెదనాన్న దశదిన కర్మలకు వచ్చి అనంతలోకాలకు వెళ్ళాడు

మహబూబాబాద్: పెదనాన్న దశదిన కర్మలకు వచ్చిన వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలో ఇటీవల ఒకరు మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులు దశదిన కర్మ నిర్వహించారు. ఈ క్రమంలో అందరూ స్నానం చేస్తుండగా.. ఈ కార్యక్రమానికి వచ్చిన నలమాస ప్రకాష్ బావిలో దూకాడు. ప్రమాదవశాత్తు బావిలో ఇరుక్కుపోయి మృతి చెందాడు.