కట్టంగూరులో ఆలయ హుండీ లెక్కింపు
NLG: కట్టంగూరు మండల కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో ఆదివారం హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. గత ఏడాది జూలై 05 నుంచి నేటి వరకు (మార్చి 22, 2026) భక్తులు తమ మొక్కుల రూపంలో సమర్పించుకున్న కానుకలను లెక్కించగా.. రూ.17,944ల నగదు వచ్చినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి.