నులిపురుగుల నిర్మూలనే లక్ష్యం: ఎమ్మెల్యే

MBNR: బాల, బాలికలలో నులి పురుగుల సమస్య నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. దేవరకద్ర ZPHSలో సోమవారం విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. ప్రతి సంవత్సరం రెండు విడతలలో నులిపురుగుల నివారణ మాత్రలు ప్రభుత్వ ఉచితంగా పంపిణీ చేస్తుందన్నారు.