VIDEO: ఏలూరు జిల్లాలో ఘరానా మోసం
ఏలూరు జిల్లాలో పురాతన బంగారం పేరుతో నకిలీ ఆభరణాలు అమ్మి కొందరు మోసానికి పాల్పడ్డారు. ద్వారకాతిరుమల బస్టాండ్‌లో ఓ వ్యక్తికి పరిచయమైన దుండగులు, తమకు తవ్వకాల్లో బంగారం దొరికిందని నమ్మబలికారు. మొదట అసలు బంగారం ఇచ్చి నమ్మకం కుదిర్చాక, భారీ మొత్తంలో నకిలీ బంగారాన్ని విక్రయించి పరారయ్యారు. నాలా ఎవరూ మోసపోవద్దని బాధితుడు సోమవారం తెలిపారు.