మోటారు బైకుల దొంగ అరెస్టు..!
PPM: మోటారు బైకులు దొంగను పాలకొండ పోలీసులు పట్టకొని అరెస్టు చేశారు. ఇవాళ పాలకొండ మండలం N.K.రాజపురం జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా నరసన్నపేటకు చెందిన వ్యక్తిని పట్టుకున్నామని DSP రాంబాబు తెలిపారు. అతడిని విచారించగా మరో నాలుగు బైక్లు దొంగలించినట్లు గుర్తించామన్నారు. సీసీ కెమెరాల పుటేజ్ సాయంతో కేసును చేధించామని, డీఎస్పీ పేర్కొన్నారు.