ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
SRD: ప్రజల్లో భక్తి భావం పెంపొందించడంలో నూతన దేవాలయాల నిర్మాణం ఎంతో ముఖ్యపాత్ర పోషిస్తాయని MLA గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ గ్రామంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం గుట్టపై అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మాణానికి ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. సూమారు రూ. కోటి 35 లక్షల అంచనా వ్యయంతో ఈ ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.