'ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలి'

MBNR: అంబేడ్కర్ మనకిచ్చిన ఓటు హక్కును డబ్బుల కోసం, మద్యం సీసాల కోసం అమ్ముకోకుండా సక్రమంగా వినియోగించుకోవాలని భీమ్ ఆర్మీ జిల్లా ఇన్ఛార్జ్ మాచర్ల ప్రకాష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలను చైతన్యం చేయాలని భీమ్ ఆర్మీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఓటు మన తల్లి, చెల్లి, కొడుకు లాంటిదని, దానిని అమ్ముకోకూడదని ఆయన సూచించారు.