స్పీడ్ స్కేటింగ్‌లో రిత్విక్ రెడ్డికి స్వర్ణ పథకం
ATP: రాష్ట్రస్థాయి స్పీడ్ స్కేటింగ్ పోటీల్లో గుత్తికి చెందిన ఐదేళ్ల బాలుడు రిత్విక్ రెడ్డి ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. కోచ్ రాజశేఖర్ నేతృత్వంలోని గుత్తి స్కేటింగ్ అకాడమీలో శిక్షణ తీసుకున్న బాలుడు, ఇటీవల కాకినాడలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. దీంతో రిత్విక్ రెడ్డిని కోచ్‌తో పాటు తోటి క్రీడాకారులు అభినందించారు.