గర్భాశయ క్యాన్సర్ నివారణకు టీకాలు
SRCL: గర్భాశయ క్యాన్సర్ నివారణకు 15 ఏళ్లలోపు బాలికలకు హెచ్పీవీ టీకా తప్పనిసరిగా వేయించాలని జిల్లా వైద్యాధికారిణి రజిత ఓ ప్రకటనలో సూచించారు. మహిళా దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల ప్రధాన ఏరియా ఆసుపత్రి, వేములవాడ ప్రాంతీయ ఆసుపత్రి, ఎల్లారెడ్డిపేట సామాజిక ఆరోగ్య కేంద్రంలో టీకా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 3773 మంది బాలికలను గుర్తించడం జరిగిందన్నారు.