గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసిన మిథున్ రెడ్డి

MBNR: కార్పొరేషన్ పరిధిలోని 52వ వార్డు శ్రీ హిందూ వీరాంజనేయ సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటుచేసిన గణనాథుడి మండపం వద్ద టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణనాథుడి ఆశీస్సులు ప్రజలపై ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు యాదయ్య, నాగరాజు పాల్గొన్నారు.