మూతపడనున్న బద్రీనాథ్ ఆలయం

మూతపడనున్న బద్రీనాథ్ ఆలయం

శీతాకాలం ప్రారంభమైన నేపథ్యంలో బద్రీనాథ్ ధామ్ ద్వారాలు ఇవాళ మ. 2:56 గంటలకు మూతపడనున్నాయి. ఈ క్రమంలో ఆలయాన్ని 12 క్వింటాళ్ల బంతి పువ్వులతో అలంకరించారు. శ్రీ బద్రీనాథ్–కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ఉత్సవ ముగింపు కోసం అన్ని సన్నాహాలు పూర్తి చేసింది. ఈ కార్యక్రమానికి 5,000 మందికి పైగా భక్తులు హాజరయ్యారు. ద్వారాల మూసివేత కార్యక్రమం మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభం కానుంది.