నగరంలో హత్యకు గురైన యాచకుడు
HYD: నగరంలో యాచకుడు హత్యకు గురయ్యాడు. ఈ ఘటన సనత్‌నగర్ పరిధిలోని ఫతేనగర్ వంతెన వద్ద సుమారు 50 ఏళ్లు గల నరేశ్ అనే యాచకుడు మృతి చెంది ఉన్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.