36 గంటల తర్వాత సాంకేతిక సమస్య పరిష్కారం
ఢిల్లీ విమానాశ్రయంలో ATC వ్యవస్థలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా 800కు పైగా విమానాలకు అంతరాయం కలిగింది. దాదాపు 36 గంటల తర్వాత విమాన కార్యకలాపాలు ప్రస్తుతం క్రమంగా మెరుగుపడుతున్నాయి. నిన్న 800 విమానాలు ఆలస్యం కాగా, ఈరోజు ఆ సంఖ్య 129కి తగ్గింది. ఆటోమేటిక్ మెసేజ్ స్విచ్చింగ్ సిస్టమ్ (AMSS)లో ఏర్పడిన సమస్యను అధికారులు పరిష్కరిస్తున్నారు.