అగ్ని ప్రమాదం.. భార్యా భర్తలకు గాయాలు
NGKL: లింగాలలోని సూరాపురంలో వంటగ్యాస్ నుంచి మంటలు వ్యాపించడంతో ఓ ఇంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో భార్యా భర్తలు శ్రీలత, వెంకటస్వామికి గాయాలయ్యాయి. క్షతగాత్రులు లింగాల పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్నారు. ఇంట్లోని నగదు, వెండి, బంగారు ఆభరణాలు కాలి బూడిదయ్యాయి.