ఏటూరునాగారంలో డైలీ వేజ్ వర్కర్ల నిరవధిక సమ్మె

MLG: ఏటూరునాగారం పట్టణంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్‌లో విధులు నిర్వహిస్తున్న డైలీ వేజ్ వర్కర్లు శనివారం నిరవధిక సమ్మె ప్రారంభించారు. తమను పర్మినెంట్ చేయాలని, కలెక్టర్ సర్క్యులర్ ప్రకారం జీతాలు, ఆరు నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జీవో 64 రద్దు చేయాలని కోరారు. ఈ సమ్మెకు టీడీపీ నేత అన్నమయ్య వారికి మద్దతు తెలిపారు.