అమ్మకానికి అధ్యక్షుడి ఇల్లు

అమ్మకానికి అధ్యక్షుడి ఇల్లు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నివాసం అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది. ఆయన చిన్నతనంలోనే ఈ ఇంటిలో ఎక్కువ కాలం ఉన్నట్లు సమాచారం. ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్ అయిన ట్రంప్ తండ్రి ఈ నివాసాన్ని నాగరిక జమైకా ఎస్టేట్స్ పరిసరాల్లో ట్యూడర్ శైలిలో నిర్మించారు. ప్రస్తుతం ఈ ఇంటి విలువ 2.3M డాలర్లు. ఇంటి అమ్మకానికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.