కుక్కల దాడిలో మేక, గొర్రె పిల్లలు మృతి

కుక్కల దాడిలో మేక, గొర్రె పిల్లలు మృతి

SDPT: కొండపాక మండలం మర్పడగ గ్రామంలో కుక్కల దాడిలో 30 మేకలు, గొర్రె పిల్లలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన పిండి నారాయణ తన జీవనోపాధి కోసం మేకలు, గొర్రెలు పెంచుకుంటున్నాడు. మధ్యాహ్నం సమయంలో ఆయన కుమారుడు ఇంటికి వచ్చి చూసేసరికి కొట్టం నుంచి కుక్కలు బయటకు వస్తుండటంతో, లోపలికి వెళ్లి చూడగా సుమారు 30 జీవాలు చనిపోయి ఉన్నాయని తెలిపారు.