నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు

SS: జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. సోమవారం రాత్రి నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకు వర్షం కురవడంతో బత్తలపల్లి గ్రామ సమీపంలో రహదారిపై భారీ వృక్షం కూలిపోయింది. సంబంధిత అధికారులు కూలిన వృక్షాన్ని తొలగిస్తున్నారు. మరోవైపు కోటపల్లి గ్రామంలో విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. రహదారిపై ప్రమాదకరంగా పడిపోవడంతో అధికారులు వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు.