అంబులెన్స్‌లో గర్భిని ప్రసవం

అంబులెన్స్‌లో గర్భిని ప్రసవం

ADB: పురిటి నొప్పులతో ఆదిలాబాద్‌ రిమ్స్‌కు వెళ్తున్న చెంపల్లి గ్రామానికి చెందిన యోగిత అంబులెన్స్‌లోనే మగ బిడ్డకు జన్మనిచ్చింది. గురువారం నొప్పులు తీవ్రం కావడంతో బేల పీహెచ్‌సీ నుంచి 108లో రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో ఈఎంటీ సాయి కిరణ్‌ ప్రసవం చేశారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు.