అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు?

టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని బీసీసీఐ మరోసారి పొడిగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అగార్కర్ నేతృత్వంలో టీమిండియా 2024 T20 WC, అలాగే ఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అగార్కర్ పనితీరుతో సంతృప్తి చెందిన బీసీసీఐ.. 2026 T20 WC, 2027 ODI WCలను దృష్టిలో ఉంచుకుని అతని పదవీకాలాన్ని అప్పటి వరకు పొడిగించాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.