'అభ్యర్థులు నిబంధనలు తప్పక పాటించాలి'

'అభ్యర్థులు నిబంధనలు తప్పక పాటించాలి'

ASF: జైనూర్ మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నిబంధనలు తప్పక పాటించాలని CI రమేష్ గురువారం సూచించారు. నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి తన వెంట ఇద్దరు వ్యక్తులను మాత్రమే రిటర్నింగ్ అధికారి వద్దకు తీసుకువెళ్లాలని తెలిపారు. ఎన్నికల ర్యాలీలకు ముందస్తుగా పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.