128 ఏళ్ల యోగా గురువు మృతి.. మోదీ సంతాపం

ప్రముఖ యోగా గురువు, పద్మశ్రీ అవార్డు గ్రహీత స్వామి శివానంద మృతి చెందారు. 128 ఏళ్ల ఆయన వారణాసిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. శివానంద మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. ఆయన మృతి యోగా రంగానికి తీరని లోటు అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మరోవైపు, శివానంద మృతి పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.