VIDEO: కారు బోల్తా.. ఐదుగురికి గాయాలు

ప్రకాశం: ఒంగోలు నుంచి దశరాజుపల్లి వెళ్లే రోడ్డులో సోమవారం ఒక కారు బోల్తా పడటంతో అందులో ఉన్న ఐదుగురికి గాయాలయ్యాయి. వాళ్ళు ఒంగోలు నగరంలోకి ప్రవేశిస్తుండగా అతి వేగం వలన కారు బోల్తాపడింది. గాయపడిన యువకుల్లో ఒకరికి చేయి విరగగా, మరొకరి తలకు తీవ్ర గాయమైంది. ఆ యువకులు ఒంగోలు నగరంలోని కేశవరాజుకుంటకు చెందిన వారని సమాచారం.