గ్రంథాలయ పితామహులకు ఘన నివాళులు

గ్రంథాలయ పితామహులకు ఘన నివాళులు

SKLM: సారవకోటలో 58వ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా గ్రంథాలయ ఉద్యమకారులు అయ్యంకి వెంకటరమణయ్య, రంగనాథన్ చిత్రపటాలకు పూలమాలవేసి ఆదివారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి నాగేశ్వరరావు మాట్లాడుతూ.. గ్రంథాలయ అభివృద్ధికి వీరు చేసిన కృషి మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు పాఠకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.