బేలర్ యంత్రంలో చేయి పడి రైతుకు గాయాలు
WGL: పర్వతగిరి మండలంలోని రావూరు గ్రామంలో గురువారం గడ్డి కట్టే బేలర్ యంత్రంలో చేయి పడడంతో కొల్లూరి దేవేందర్ తీవ్రంగా గాయపడ్డారు. యంత్రంలో దారం చిక్కుకోవడంతో దాన్ని సరిచేసే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా ఆయనను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.