రెబ్బెన ఎస్సైగా వెంకటకృష్ణ బాధ్యతలు స్వీకరణ

ASF: రెబ్బెన మండల ఎస్సైగా వెంకటకృష్ణ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడే వారిపై నిఘా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. విధి నిర్వహణలో ప్రతిఒక్కరు సహకరించాలని కోరారు.