ఆర్టీసీ డిపోను పరిశీలించిన జిల్లా రవాణ అధికారి

కోనసీమ: రాజోలు ఆర్టీసీ డిపోను జిల్లా ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ రాఘవ కుమార్ ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మరుగుదొడ్లు పరిశీలించి, నీటి సౌకర్యాలు, శుభ్రతకు సంబంధించిన సూచనలు చేశారు. త్రాగునీటి సౌకర్యాలను తనిఖి చేసి, కొత్త ఆర్వో వాటర్ ప్లాంట్ ఏర్పాటు పనుల పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు .