30 రోజుల పని ఒక్క రోజులో..!

30 రోజుల పని ఒక్క రోజులో..!

AP: ప.గో. జిల్లా నరసాపురం-కాజ 33కేవీ లైన్ పనుల్లో డ్రోన్లను ప్రయోగాత్మకంగా వాడారు. 30 మంది కార్మికులు నెల రోజులు చేసే పనిని డ్రోన్ సాయంతో కేవలం కొన్ని గంటల్లోనే పూర్తి చేశారు. డ్రోన్ ద్వారా తీగలను ఒక టవర్ నుండి మరో టవర్‌కు లాగించడం వల్ల శ్రమ, సమయం ఆదా అయ్యాయి. సాధారణ పద్ధతి కంటే ఆరు రెట్లు వేగంగా పనులు పూర్తి చేయడం విశేషం.