VIDEO: కోతుల సమస్యపై కీలక చర్యలు
MLG: ఏటూరునాగారంలో కోతుల సమస్యపై కీలక చర్యలు చేపట్టారు. సర్పంచ్ శ్రీలత ఆధ్వర్యంలో మొదటి విడతగా 89 కోతులను పట్టుకున్నారు. పట్టుకున్న కోతులను ఛత్తీస్‌గఢ్ అడవుల్లో వదిలినట్లు పేర్కొన్నారు. గ్రామంలో కోతుల బెడద గణనీయంగా తగ్గిందని తెలిపారు. ఇంకా ఏ సమస్య అయిన ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని గ్రామపంచాయతీ అధికారులు కోరారు.