మృతుల కుటుంబాలకు పరిహారం అందజేత
AP: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందజేసింది. రూ.15 లక్షల చొప్పున పరిహారాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రి అచ్చెన్నాయుడు అందజేశారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని అచ్చెన్నాయుడు తెలిపారు. కాగా, తొక్కిసలాట ఘటనలో తొమ్మిది మంది మృతిచెందగా.. 25 మంది తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే.