నేడు మెగా జాబ్ మేళా
BDK: సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఇవాళ కొత్తగూడెం క్లబ్‌లో మెగా జాబ్ మేళా జరగనుంది. 65 కంపెనీల్లో 3 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీఎండీ బలరాంతో కలిసి ఈ జాబ్ మేళాను ప్రారంభిస్తారు. నిరుద్యోగ యువత కోసం అన్ని ఏర్పాట్లు చేశామని సింగరేణి అధికారులు ప్రకటించారు.