'రైతులకు సకాలంలో యూరియా అందజేయాలి'

NDL: రైతులకు సకాలంలో యూరియా అందజేయాలని సీపీఎం మండల కన్వీనర్ పక్కిరి సాహెబ్ డిమాండ్ చేశారు. గురువారం పగిడ్యాల సొసైటీ గోదాం వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. నాయకురాలు గంధం హుసేనమ్మ మాట్లాడారు. రైతుల సంక్షేమమే తమ ద్యేయమని ప్రకటనలు గుప్పిస్తున్న కూటమి, ఆచరణలో మాత్రం శూన్యం అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.