చింతపల్లిలో వరి పంటకు అగ్గి తెగులు

చింతపల్లిలో వరి పంటకు అగ్గి తెగులు

ASR: చింతపల్లి పరిధి పలు ప్రాంతాల్లో వరి పంటకు అగ్గి తెగులు సోకినట్లు గుర్తించామని ఏడీఏ బీవీ తిరుమలరావు అన్నారు. తెగులు వల్ల పైరు పిలకలు తొడగడం నిలిచిపోతుందన్నారు. చిన్నగెడ్డ, చౌడుపల్లి గ్రామాల్లో శుక్రవారం పర్యటించారు. రైతులతో వరి పంట పొలాలను పరిశీలించారు. అగ్గి తెగులు నివారణకు ట్రైసైక్లోజోల్ మందును 0.6 గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలన్నారు.