VIDEO: రోడ్డు డ్యామేజ్‌పై గ్రామస్థుల ఆందోళన
GDWL: జిల్లా వడ్డేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పైపాడు గ్రామంలో త్రాగునీటి పైప్‌లైన్ వేసే క్రమంలో రోడ్డు దారుణంగా డామేజ్ అయిందని గ్రామ ప్రజలు, వివిధ సంఘాల నాయకులు శనివారం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై ఉన్న బురద కారణంగా వాహనదారులు, పాదచారులు జారిపడే ప్రమాదం ఉందని, దీనికి కాంట్రాక్టర్ లేదా ఉన్నతాధికారులు ఎవరు బాధ్యత వహిస్తారంటూ ప్రశ్నించారు.